సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేడు, గురువారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలతోనూ సమావేశమైనట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరాయన్నారు. తెలంగాణాలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 ఉన్నారన్నారు. తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని.. రాష్ట్రంలో 2022-23లో 22 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించామని, ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు చేసుకున్నారని తెలిపారు. 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని అన్నారు.
