సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో సంచలనం రేకెత్తించిన హత్యలకు వెనుకాడని సుపారీ గ్యాంగ్ కదలికలు, కిడ్నాప్ కేసును నేడు, గురువారం పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్‌లో ఇద్దరు ప్రధాన ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కేసు డొంక కదిపితే.. భీమవరం పట్టణానికి చెందిన సతీష్ రాజుకు గుంటూరు జిల్లాకు చెందిన కాంతారావు 50 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు. అప్పు డబ్బులు ఇస్తామని పిలిచి కాంతారావుని ఏలూరులో ఒక హోటల్ లో సతీష్ రాజు, అతని అనుచరులు అకస్మాత్తుగా బంధించారు. తరువాత కాంతారావుని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. తుపాకీతో రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి కాంతారావుని సుపారీ గ్యాంగ్ బెదిరించింది. మళ్లీ డబ్బులు అడిగితే చంపుతామని హెచ్చరించింది. బాధితుడు కాంతారావు ఫిర్యాదు మేరకు ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుపారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు గన్ షూటర్స్ కోసం రెండు బృందాలు ఏర్పడి పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *