సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. 2019లో విడుదలై మంచివిజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ ..డైలాగ్ సీఎం జగన్ కు ఉతపదంగా మారిపోయింది, ఈ చిత్రానికి సీక్వె ల్ తెరకెక్కు తున్న విషయం తెలిసిందే! యాత్ర 2 లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మరోసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో చిత్ర యూనిట్ నేడు, సోమవారం విడుదల చేసింది. పోస్టర్లో మమ్ముట్టి, జీవా తో పాటు . ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు . కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి…నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్ను కూడా పోస్టర్ లో వేశారు. ‘యాత్ర’ చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న విడుదల చేసారు. . అలాగే ఇప్పుడు ఎన్నికల వేళా ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు ఈ చిత్రానికి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *