సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు దీంతో రేపు బుధవారం జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది అని సమాచారం. అయితే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిసి వెళ్లే విషయంలో జనసేన క్యాడర్ కు కార్యాచరణ అంశంపై పవన్ రేపు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పవన్ వైరల్ ఫీవర్‌తో.. త్వరలో పవన్ కోలుకోగానే మరో తేదీ ప్రకటిస్తామని జనసేన నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఎన్డీయే లో పొత్తు వదులుకొని టీడీపీ తో వెళ్ళటం మంచి కాదని పవన్ పునరాలోచించుకోవాలని బీజేపీ అధిష్టానం నుండి సంకేతాలు వచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
