సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నేడు, శనివారం భీమవరం వైభవంగా నిర్వహించారు. జన్మ దిన వేడుకలు కు ఎప్పడు దూరంగా ఉండే గ్రంధి శ్రీనివాస్ ఎప్పటిలానే పట్టణంలో తన అభిమానులకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ పట్టణం లో అన్ని ప్రధాన సెంటర్స్ లో వైసిపి పార్టీ మరియు ఆయన అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పండగ వాతావరణం సృష్టించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ పట్టణంలోని పలు చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి, పేదలకు ఆహారం, పండ్లు, వస్త్రదానాల్లో.. రోగులకు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటులో పాల్గొన్నారు. పలు దేవాలయాలలో జరిగిన తన తండ్రి పేరిట జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. స్థానిక డీఎన్ ఆర్ కాలేజీ వెనుక ఉన్న తిరుమల దేవస్థానం వారి వెంకటేశ్వర బధిర పాఠశాలలో పిల్లలకు మాజీ కౌన్సిల్ ప్లోర్ లీడర్ గాదిరాజు తాతారాజు ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి, పండ్లు బ్రేడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమాలలో తోట బోగయ్య తో పాటు పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు. మంచి మిత్రులు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు సర్వదా ఆయురాగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని కోరుకొంటూ .. మన సిగ్మా న్యూస్ తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాము.. సిగ్మా ప్రసాద్
