సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విఫ్ గ్రంధి శ్రీనివాస్ స్థానిక 6వ వార్డు ( 3 టౌన్) లో 38 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో అల్లూరి సీతారామరాజు బొమ్మ రోడ్ నందు కోడేటి వారి వీధిలో నూతనంగా నిర్మాణం చేసిన సిసి రోడ్,సిసి డ్రైన్ ప్రారంభించారు. తదుపరి అదే వార్డులో ఇండస్ట్రియల్ ఏరియా 132 కేవీ సబ్స్టేషన్ నుండి CSN కాలేజీ వరకు 28 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన సిసి రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో జిల్లా వైసిపి మహిళా అడ్జక్షురాలు గూడూరి ఉమాబాల తో పాటు స్థానిక ప్రజలు వైసిపి నేతలు పాల్గొన్నారు.
