సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు ప్రజలకు చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజమాస బ్రహ్మోత్సవాలు రేపటి మంగళవారం 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
