సిగ్మాతెలుగు డాట్ ఇన్,న్యూస్: సినీ హీరో జూనియర్ యన్టీఆర్ తన తాతను తలుచుకుంటూ ఆయన వర్ధంతి నేపధ్య్మలో తాజగా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ‘తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువ తార మీరే’ అంటూ యన్టీఆర్ తన తాతను గుర్తుచేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయనతో సీనియర్ యన్టీఆర్ కు మంచి అనుబంధం ఉండేది. జూనియర్ యన్టీఆర్ ను తాత అంటూ ముద్దు చేసేవారు ఆయన. ఆయన పట్ల ఎనలేని అభిమానం, గౌరవం కలిగి ఉండే తారక్ కు ఆయనే ఇన్స్పిరేషన్. 1996, జనవరి 18న కన్నుమూశారు యన్టీఆర్. తెలుగు ప్రేక్షకులకు ఆయనో జ్ఞాపకంగా మారి అప్పుడే 26 ఏళ్ళయిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు స్వర్గీయ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలలో ఘన నివాళ్లు అర్పిస్తున్నారు. నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు కూడా తాజా వీడియో సందేశంలో స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘన నివాళ్లు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *