సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఫైబర్ నెట్ కేసులో గతనెల అక్టోబర్ 9న టీడీపీ అధినేత, చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఫైబర్ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీనితో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు గురువారం సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ ఫైబర్ నెట్ కేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది. అలాగే గతంలో చంద్రబాబు అరెస్ట్ కు దారితీసిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో దీపావళి పండుగ తర్వాత తీర్పును ప్రకటిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *