సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటాను టీటీడీ రేపు, శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలుంటాయి. ఈ క్రమంలో రోజుకు 25 వేల చొప్పున పదిరోజులకు సంబంధించిన 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, రోజుకు 2 వేల చొప్పున శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేస్తారు. అయితే ఉదయం 10 గంటలకు రూ.300 దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్లను విడుదల చేయనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు ఈ పదిరోజులకు సంబంధించిన గదుల కోటాను కూడా విడుదల చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *