సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆధికారులు ముందస్తు ఏర్పా ట్లకు రెడీ అవుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు ఇప్పటికే ఎన్నికల బూత్‌లను గుర్తించి సిద్ధం చేసిన ఆధికారులు తాజాగా జిల్లా కేంద్రం భీమవరంలో ఎన్నికల సామాగ్రి భద్రపరిచే స్ర్టాంగ్ రూమ్,సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, సిబ్బందికి శిక్షణ తరగతులకు నిర్వహణకు ఆనుకూలమైన ప్రదేశాలను ఇప్పటికే గుర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లాలోని భీమవరం, నరసాపురం, ఉండి ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సామాగ్రి దాచేందుకు గోడౌన్లను పరిశీలించారు. ఇంకా పాలకొల్లు, తణుకు తాడేపల్లి గూడెం లలో కూడా పరిశీలిస్తారు.భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళా శాల విష్ణు కాలేజీలో కలెక్టరు, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, జేసీ రామ్‌సుందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై ఎస్పీతో చర్చించారు. జిల్లా లో గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ తో పాటు ఆర్డీవో కె.శ్రీనివాసులు రాజు, తహ సీల్దారు రవికుమార్ పాల్గొన్నారు
