సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా కీలక పరిణామాలు నేపథ్యంలో ప్రముఖ ఐటి కంపినీలు సైతం ఇంజనీరింగ్ కాలేజీలలో విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్యూల నిర్వహణ బాగా తగ్గించిన నేపథ్యంలో సైతం.. భీమవరంలో అందరి విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రతిష్టాకర DNR ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రం కాంపస్ రిక్రూట్మెంట్ డ్రై లు గతంలో కంటే ఎక్కువ జరుగుతుండటం విశేషం.. ఈ నేపథ్యంలోఈ నవంబర్ నెల 07 మరియు 08 తేదీల్లో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో 15 మంది ఎంపిక అయ్యారని DNR కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ కొత్తపల్లి శివరామరాజు మరియు .కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలో చిన్నపాటి ఉద్యోగానికి సాధారణ అర్హతలతో పాటు అదనపు నైపుణ్యాలను అడుగుతున్నారు అందుకే మా కాలేజీలో విద్యార్థులకు మంచి మార్కులతో డిగ్రీ పట్టా ఒక్కటే కాకుండా ‘భావవ్యక్తీకరణ నైపుణ్యాలు’ మరియు ఆధునిక సాఫ్ట్వేర్ల ఫై మంచి అవగాహనా కలిగిస్తున్నట్లు తెలిపారు. ప్లేసెమెంట్ డైరెక్టర్ డా. సిహెచ్.రాంకిషోర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు తమ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సుమారు రెండువందలయాబై కు పైగా ఉద్యోగాలు కల్పించామని మరియు మిగిలిన విద్యార్థులందరికీ త్వరలో ఉద్యోగాలు కోసం దేశీయ, బహుళ దేశీయ సంస్థల క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లను నిర్వహించనున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *