సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగునాట ప్రముఖ సీనియర్ హీరో, నటుడు చంద్రమోహన్ ఈరోజు శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల చంద్రమోహన్ సుమారు 900కి పైగా చిత్రాలలో నటించారు. అతని పార్థివ శరీరం ఆసుపత్రి నుండి, ఫిలిం నగర్ లో వున్న అతని ఇంటి దగ్గరకి తరలించారు. పరిశ్రమ నుండి సినీ ప్రముఖులు చంద్రమోహన్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.చంద్రమోహన్ పార్దీవ దేహాన్ని అభిమానుల, పరిశ్రమలోని వారి సందర్శనార్థం ఫిలింనగర్ లోని ఆయన ఇంటి వద్దనే ఏర్పాట్లు చేసారు చంద్రమోహన్ కుటుంబ సభ్యులు. కృష్ణ జిల్లాల్లో 1942 లో జన్మించిన ఆయన బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేసి కొంతకాలం ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసుకు వెళ్లారు. ‘రంగులరాట్నం’ (1966) చిత్రంతో హీరోగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత ఆయన చేసిన ‘సుఖదుఖాలు’, ఈనాడు, శంకరాభరణం ,ముగ్గురు మిత్రులు, పెద్దోడు చిన్నోడు, శిక్ష, నాకు పెళ్ళాం కావాలి, 7 జి బృందావన్ కాలనీ, ఆదిత్య 369, రణం, ఆమె గణేష్, సంక్రాంతి, వంటి ఎన్నో చిత్రాలు..చాల సహజంగా నటించే చంద్రమోహన్‌కు చాలా పేరు తెచ్చిపెట్టాయి. గత 6ఏళ్లుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరగా గోపీచంద్ ‘ఆక్సిజన్’ మూవీలో నటించిన తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. శ్రీదేవి తొలిసారి చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా నటించిన ‘పదహారేళ్ల వయసు’ చిత్రం 1978లో రిలీజై ఘన విజయం సాధించింది. జయసుధ, జయప్రద , విజయశాంతి వంటి ఎందరో హీరోయిన్లు మొదటగా ఆయన సరసన నటించి తరువాత ఆయనకు అందనంత ఎత్తు ఎదిగినవారే.. స్వర్గీయ ఎన్టీఆర్ సైతం ఒక సభలో.. మరో గుప్పెడు పొడుగు ఉంటే చంద్రమోహన్ మమ్ములను హీరోగా ఎప్పుడో దాటి పోయేవాడు అన్నారంటే..
