సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం ప్రారంభ నేపథ్యంలో నేడు, మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాలలో కీలకమైన భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవాలయం మరియు పాలకొల్లు క్షిరా రామలింగేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నేటి తెల్లవారు జాము 3గంటల నుండి శీతల గాలుల పొగమంచుతో పోటీపడుతూ శివభక్తుల ఆధ్యాత్మిక సందడితో ఆలయ ప్రాంగణాలు శివోహం శోభతో కళకళ లడాయి. భీమవరం సోమేశ్వర ఆలయం తో పాటు స్థానిక 11వందల యేళ్ళనాటి ఉమా భేమేశ్వర స్వామి దేవాలయం , యన్మదురు లోని స్వయం భూ, శ్రీ శక్తేశ్వర స్వామివారి దేవాలయాలలో వేలాది భక్తులు స్వామివార్లను శక్తి మాత లను దర్శించుకొని పవిత్ర దీపారాధనలు చేసారు.
