సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ కి విరాళాలు వచ్చిన ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నేడు, మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. స్కిల్ కేసుకు సంబంధించి వ్యక్తుల నుండి పార్టీ ఖాతాలోకి వచ్చిన 27కోట్లకు పైగా విరాళాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో కోరింది. అయితే పార్టీకి సంబంధించి విరాళాలను అడగడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.
