సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం ను భీమవరం జేపీ రోడ్డులోని ఒక మినీఫంక్షన్ హాల్ యందు నిర్వహించారు. ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరాక జరిగిన మొదటి ఉమ్మడి సమావేశంలో పాల్గొన్న జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాలలో ఇరుపార్టీ నాయకులతో నియోజకవర్గ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని రానున్న ఎన్నికలలో ఉమ్మడిగా విజయం సాధించడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లనున్నామని తెలిపారు.జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ రాష్ట్ర సభ్యుడు వేగేశ్న సూర్యనారాయణరాజు (కనకరాజుసూరి) మాట్లాడుతూ గ్రామ సర్పంచి నుండి ప్రధానమంత్రి వరకు విజయం సాధించడానికి పోలింగ్ బూత్ లు మూల స్తంభాలని ఇరు పార్టీ నాయకులు బూత్ స్థాయిలో ఐక్యమత్యంతో ఉమ్మడి అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేయాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. వైయస్ జగన్ ప్రభుత్వం తెదేపా జనసేన ప్రతిపక్ష నాయకులపై కుట్రపూరితంగా అక్రమ కేసులుపెట్టి న భయపడేదిలేదని న్యాయపరంగా ధైర్యంగా ఎదుర్కొందామని ఇరు పార్టీలు ఉమ్మడి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు..ఈ సమావేశానికి మాజీ టీడీపీ ఎమ్మెల్యే అంజిబాబు ను ఆహ్వానించకపోవడాన్ని ఆమె సమర్ధించుకొన్నారు. గత 4న్నర ఏళ్ళు ఆయన పార్టీని వదిలి ఎక్కడ ఉన్నారని మీడియా ఆయనను ప్రశ్నించాలన్నారు. ఈ సమావేశంలో ఎజెండాలోని అంశాలు నవంబర్ 17వ తేదీ నుండి భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ,బూత్ ల వారిగా ఓటర్ల జాబితా పరిశీలన, ప్రభుత్వ వైఫలాలపై ఉమ్మడి సమావేశాలు పోరాటాలు నిర్వహించటంపై తీర్మానాలను ఆమోదించారు. ఈసమావేశంలో జనసేన నాయకులు ఇర్రింకి సూర్యారావు జడ్పిటిసి గూండా జయప్రకాష్, చేనమల్ల చంద్రశేఖర్, తదితరులతో పాటు తెదేపా రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు వెండ్ర శ్రీనివాస్, టిడిపి పట్టణ అధ్యక్షలు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు , టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, వీరవల్లి చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శిలు చెల్లబోయిన సుబ్బారావు మైలాబత్తుల ఐజాక్ బాబు క్లస్టర్ ఇన్చార్జిలు మెరగాని నారాయణమ్మ మెంటే గోపి ,పామర్తి వెంకటరామయ్య , ఎద్దు యేసుపాదం తదితరులు పాల్గొన్నారు.
