సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మెంటేవారితోటలోని రాజులపేట వద్ద నేటి మంగళవారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10కి పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. లక్షల రూపాయలు నగదు, బంగారం బుడిదయ్యాయి అని బాధితులు విలపిస్తున్నారు. ఈనేపథ్యంలో స్థానిక ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ ఓ, పోలీస్ అధికారులతో కలసి బాధితులను పరామర్శించి అగ్నికి ఆహుతి అయిన గృహాలను , కాలిన రూపాయలు , సామగ్రిని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహకారం అందించడానికి కృషి చేస్తానని ప్రస్తుతానికి బాధిత కుటుంబాలకు కొంత ఆర్ధిక సాయం, నిత్యావసర సామాగ్రి అందిస్తూ… పట్టణంలో దాతలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై సీపీఎం బృందం వెంటనే స్పందించి బాధితులను పరామర్శించారు. దుప్పట్లు, భోజనాలు తక్షణ సహాయం క్రింద అందించారు. దాతల సహకారంతో సామగ్రి కూడా అందించనున్నట్లు తెలిపారు. భోరున విలపించిన బాధితులను ఓదార్చి ప్రభుత్వం పునరావాసం కల్పించే వరకు మెంటే వారి తోటలోనే ఉన్న తమ సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉండొచ్చని భరోసా కల్పించారు.సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ఘోర అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తక్షణం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
