సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి అదనపు ఆధ్యామిక ఆకర్షణగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత పెద్ద చర్చి ,అత్యున్నత ప్రమాణాలతో భీమవరం పీపీ రోడ్డులో ఉన్న నూతన రూపాంతర దేవాలయానికి నేడు, బుధవారం ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ రూపాంత దేవాలయానికి చాల చరిత్ర ఉంది. బ్రిటిష్ వారి పాలనలో 1895లో సుమారు 72 సెంట్ల విస్తీర్ణం లో రాతి కట్టడంగా దీనిని నిర్మించారు. ఈ చర్చికి కులమత రహితంగా వచ్చే భక్తులకు ఎంతో ప్రశాంతత తో పాటు స్వాంతన చేకూరేది. అయితే కాలక్రమంలో పెరిగిన క్రైస్తవ భక్తుల కు సౌకర్యంగా లేకపోవడంతో అత్యంత ప్రతిష్టంగా ఉన్నప్పటికి పాత చర్చిని తొలగించి 2012 మార్చి 27న ఈ నూతన మందిర పునర్నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అప్పటినుం చి అంచెలు అంచెలుగా 13 ఏళ్లపాటు దాతల సహకారంతో కోట్లాది రూపాయలు ఖర్చుతో ,నిర్మాణ కమిటీ ఛైర్మన్, ఆర్ కమల్ రాజ్ సమన్వయంతో నిర్మాణం పూర్తీ చేసారు. నూతన మందిరాన్ని 3ప్లోర్స్ 2 స్టెయిర్స్ గా 156 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో భారీ ప్రవేశద్వారంలతో నిర్మించారు. లోపలి భాగంలో రెండు అంతస్తుల్లో ఒకేసారి సుమారు 4వేలమంది ప్రార్థనల్లో పాల్గొనేలా భారీ హాలు నిర్మించారు. 11 మంది శిష్యులతో కలిసి ఏసు క్రీస్తు విందులో పాల్గొన్న ఘట్టాన్ని శిల్పాలతో ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు. చెన్నై , ముంబయిలలో రూపుదిద్దుకున్న పురాతన తరహా గాజు పెయింటింగులు అమర్చారు. సెంట్రల్ ఏసీ, మంచి సౌండ్ సిస్టం వంటి సదుపాయాలున్నాయి. పాత చర్చి కి సంబంధిచిన భారీ గంట, చిహ్నాలు, వెండి సామగ్రిని ఒక గదిలో భద్రపరిచారు.
