సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు భీమవరం అటు నరసాపురం ప్రజలకు సమీపంలో ఉన్న పేరుపాలెం బీచ్లో సముద్ర స్నానాలను నిషేధించారు. ఇప్పటికే తరచూ ఎందరో యువకులు ఈ సముద్ర తీరంలో అసువులు బాసారు. అయితే పవిత్ర కార్తీక మాసం వేలాదిగా ప్రజలు పుణ్యం, ఆహ్లాదం కోసం ఈ బీచ్ కు తరలి వస్తున్నా నేపథ్యంలో ఇకపై ప్రజలను కేవలం తీర్థ స్నానాలను మాత్రమే అనుమతిస్తారు. అది కూడా అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే చేయాల్సి ఉంటుంది. పేరుపాలెం బీచ్లో అండర్ కరెంట్ ఉండటంతో అకస్మాత్తుగా గోతులు, గుంటలు పడుతున్నాయి. ఇది తెలియని సందర్శకులు సముద్రంలోకి దిగి గల్లంతవుతున్నారు. పలువురు ప్రాణా లు కోల్పోతు న్నారు. ఈనేపథ్యంలో పేరుపాలెం బీచ్పై అవగాహన ఉన్న నిపుణులతో చర్చించి, ఉన్నతాధికారుల సలహా మేరకు సముద్రస్నానాలు రద్దు చేశామని తహసిల్దార్ నాగార్జునరెడ్డి తాజగా విలేకరులకు తెలిపారు. ఈ బీచ్ ఎంజాయిమెంట్ బీచ్ కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు సముద్రస్నానాలు నిషేధించామని మొగల్తూరు ఎస్సై రఘు చెప్పారు.
