సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా సమయంలో భీమవరం, టీపీ గూడెం తదితర పట్టణ ప్రాంతాలలో కరోనా రోగుల సౌకర్యాలు, ఆహారం, సేవలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబందించిన ఉద్యోగులు చేసిన ఖర్చులకు సంబంధించి బిల్లుల ఫై విజిలెన్సు రహస్య దర్యాప్తు చేస్తుందని పలు వార్త కధనాలు వచ్చాయి. అయితే ఒక మీడియా లో టిపి గూడెంలో పక్కాగా స్కాం జరిగిందని వార్తలు వచ్చాయి. దీనిపై మున్సిపల్ ఆర్డీ ,సత్యనారాయణ, రాజమహేంద్రవరం నుండి వివరణ ఇచ్చారు.. కోవిడ్ సమయంలో తాడేపల్లి గూడెం మున్సి పాలిటీలో పనిచేసే ఆరుగురు ఉద్యో గులు కోవిడ్ సేవల ఖర్చు ల కోసం అడ్వాన్సులు తీసుకున్నారు. వారి నుండి ఇంకా బిల్లులు, చెల్లింపులు (47లక్షల రూపాయలకు పైగా?) కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ విషయం పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలుంటాయి. ఒక అకౌంట్స్ అధికారిని నియమించి సొమ్ములు రాబడతాం .ప్రభుత్వ సొమ్ము ఎక్కడికీ పోదు. దీనికి సంబంధించి సంబంధిత ఉద్యోగులకు అక్కడి కమిషనర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సొమ్ములు చెల్లించకపోతే ఉద్యో గుల ఉద్యోగ విరమణానంతరం కూడా ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభావం ఉంటుంది. అంతే కాని ఇది ఎంతమాత్రం స్కాం కాదు అని వివరణ ఇచ్చారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *