సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వన్డే ప్రపంచకప్‌ 2023 లో భాగంగా ముంబయి లో గత రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 398 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ హోరాహోరీగా పోరాడి 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత వరల్డ్ కప్ లో భారత్ ను సెమి ఫైనల్ లో ఓడించిన న్యూజిలాండ్ ఫై భారత్ ప్రతీకారం తీర్చుకొంది, న్యూజిలాండ్ 39 పరుగులకే షమీ బౌలింగ్లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే విలియమ్సన్ (69), మిచెల్ (134) జోడి రాణించడం భారత్ అభిమానులకు టెన్షన్ పుట్టించింది. కానీ ఇంతలో మరోసారి షమీ బౌలర్ గా విజృంభించాడు. ఆట మొత్తం మీద ఏకంగా 7 వికెట్లు సాధించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అయ్యాడు.. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో 50వ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇక ఫైనల్ పోరులో భారత్ ప్రపంచ విజేతగా ఆవిర్భవించడం ఒక్కటే తరువాయి. భారత్ జట్టుతో పాటు షమ్మీ ని ప్రధాని మోడీ ప్రత్యకంగా అభినందిస్తూ సందేశం పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *