సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : మంత్రి, డాక్టర్ సీదిరి అప్పలరాజు నేడు, శుక్రవారం పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు న్యాయ వాదులు అఫిడివిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరారని.. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్ గా పరిశీలించాను. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ప్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చెయ్యరు. చంద్రబాబు ఆరోగ్యం కోసమే బెయిల్ ఇచ్చారు తప్ప ఆయన తప్పు చెయ్యలేదని ఇవ్వలేదు. మరల ఆయన బెయిల్ పొడిగింపు కోసం ఇన్ని డ్రామాలు ఎందుకు’’ అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. ‘చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం చచ్చిపోతున్నారని పచ్చ మీడియా వార్తలు రాసింది. చనిపోయిన వాళ్లని ఓదార్చుతామని, వెళ్లి కొందరికి డబ్బు ఇచ్చారు.. నిజం గెలవాలని భవనేశ్వరి యాత్ర చేపట్టారు.తీరా చంద్రబాబు బయటకు వచ్చాక యాత్ర ఎందుకు ఆపేశారు? ఇక్కడే ప్రజలు వీళ్ళ మోసపు బుద్ధి గమనించాలి..అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ డ్రామాలపై నిజం గెలవాలని మేమూ డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *