సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ ఎన్ని సంక్షేమ పధకాలు అమలు చేసిన అందులో పేరు తెచ్చినవి మాత్రం వృధాప్య పింఛనులు ,ఆరోగ్యశ్రీ , కార్పొరేట్ శక్తులకు ఎదురునిలచి ప్రభుత్వ పాఠశాలల నాడు- నేడు ఆధునీకరణ, అమ్మవడి, కాలేజీ విద్యార్థులకు ఇచ్చే పీజు రియంబర్స్ మెంట్.. అయితే ఎన్నో సంక్షేమ పధకాల అమలుకు ధారాళంగా డబ్బులు ఖర్చుపెడుతుండటంతో నిధుల కొరతలతో ఎదో రకంగా 4న్నర ఏళ్లుగా రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న జగన్ సర్కార్ కు చాలాకాలంగా అమ్మవడి, విద్యాదీవెన పథకంపై అడుగులు తడబడుతున్నాయి.. ఆ పధకాలలో కొత్త లబ్దిదారులకు బదులు ఉన్నవారికే సరిపెట్టిన బాగుండేది. కరెంట్ బిల్లు ఎక్కువచ్చిందని, ఇంటి స్థలం కాస్త ఎక్కువ అడుగులు ఉందని.. ఇలా ఎదో వంకతో చేస్తున్నపాత లబ్దిదారులను కోతలతో ఆపెయ్యడంతో ..పెరిగిన నిత్యావసర ఖర్చులు, పన్నులు, కరెంట్ బిల్లులు కు తోడు అదనంగా.. ప్రభుత్వ భరోసా తో విద్యార్థులను పెద్ద కాలేజీలలో చేర్పించిన ఎందరో మధ్యతరగతి కుటుంబీకులు క్షోభ పడుతున్నారు. కొందరు పేరెంట్స్ అప్పులు చేసి వారి స్వంత ఖర్చుతో పిల్లల చదువు కొనసాగిస్తున్నారు. ఈ పధకం నడపడం కష్టంగా ఉంటె.. విదేశీ విద్య దీవెన.. కొత్త పధకం..ఈ కష్టాలకు తోడు.. మరో 5నెలలు ఎన్నికలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకంపై కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. కళాశాలల్లో విద్యార్థుల తల్లుల పేరిట ఇప్పటివరకు నమోదైన బ్యాంక్ ఖాతాలు ఇక నుంచి చెల్లవు. కొత్తగా జాయింట్ ఖాతాలు తెరచి వాటిని నమోదు చేయించుకోవాలి. ఆ ఖాతాలో ప్రైమరీ ఖాతాదారుడిగా విద్యార్థి ఉండాలి. ఈనెల 24లోపు ఈ కొత్త ఖాతా వివరాలను సంబంధిత సచివాలయాల్లో నమోదు చేయించు కోవాలని ఆదేశాలు వచ్చాయి. అయితే ఎస్సీ, ఎస్టీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను మాత్రం మినహాయించారు. కొత్తగా తెరవబోయే జాయింట్ ఖాతాలకు డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పొందాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
