సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం హనుమకొండ హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థుల విజయాల కోసం పవన్ పాల్గొని ప్రసంగించారు. ‘నేను మాట ఇస్తున్నా.. ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా..తెలంగాణ నా గుండెచప్ఫుడు. తెలంగాణ రావాలని కోరుకొన్నాను. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తోనే.. ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. తెలంగాణాలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని తెలిపారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *