సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో నిరుద్యోగులకు జాబులు కల్పించడంలో సీఎం కెసిఆర్ విఫలం అయ్యారని .. రాష్ట్రంలో ఉపాధి లేని వారి తరపున ఎన్నికల బరిలో దిగుతున్నానని తనను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో నిరుద్యోగులకు ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు అసెంబ్లీలో ప్రశ్నిస్తానని అర్హులకు సంక్షేమ పధకాలు అందిస్తానని ప్రకటించి సోషల్ మీడియాలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి సంచలనం రేపిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషపైన, ఆమె కుటుంబీకులకు బెదిరింపులు, దాడులు జరుగుతున్నా.. స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన పట్టించుకోనీ నేపథ్యంలో.. ఆమెకు స్థానిక ప్రజల నుండి తెలుగు రాష్ట్రాల నుండి అనూహ్య స్వాందన లభిస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తనకు భద్రత కావాలంటూ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించగా.. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. కాసేపటి క్రితమే విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు భద్రత కల్పించాలని పేర్కొంది.
