సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఆషాడమాసం సందర్భంగా శ్రీ అమ్మవారి దేవస్థాన చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు వివిధ రకాల పండ్లు పువ్వులు పిండివంటలు స్వీట్స్ తో సారె ఘనంగా సమర్పించారు. శ్రీ అమ్మవారి పూరి గుడి వద్ద దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ సారె కు సంప్రోక్షణ జరిపిన తరువాత అక్కడ నుండి దేవాలయం వరకు మేళ తాళాలతో శ్రీ అమ్మవారి దేవస్థానం వద్దకు చేరారు.. శ్రీ అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం విశేష పూజలు జరిపించి ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ధర్మకర్తలు మండలికి చిరు సత్కారం చేశారు. చైర్మన్ బొండాడ నాగ భూషణం ఆధ్వర్యంలో ధర్మకర్తలు నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగశిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గుణేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు కి అర్చకులు శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసారు.
