సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం రైతు బజార్ లో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను జేసి కల్పశ్రీ తో కలసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ .. బీపీటీ స్టీమ్ సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ. 62 ఉండగా రైతు బజార్లో రూ 52 లకు, బీపీటీ రా బియ్యం బయట రూ 58 ఉండగా రైతు బజార్లో రూ 50 లకు అందించడం జరుగుతుందని, ఒక్కో లబ్ధిదారునికి 10 కేజీల చొప్పున బియ్యం అందించడం జరుగుతుందన్నారు. 115 రైతు బజార్లలోనూ, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక పాయింట్లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అందిస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *