సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దశాబ్దాల సుదీర్ఘ కాలంగా సేవలు అందించిన విశాఖ విమాన ఆశ్రయం సేవలు నేటి సోమవారం నుండి నిలచిపోయాయి. ఇక ఫై నూతన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ సేవలు అందిస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నవ్యాంధ్ర ప్రయాణంలో ఒక కీలక మైలురాయి అని, ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినమని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అభివర్ణించారు. విశాఖ పరిధిలోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం‘ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రారంభోత్సవ వేడుకలలో ప్రధాన మంత్రి మోడీ తో పాటు తాను సభావేదికపై పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలబెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, ధన్యవాదాలు తెలిపారు.. దాదాపు రూ. 5,000 కోట్లతో అత్యంత అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ విమానాశ్రయం, రాబోయే రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తుందని మంత్రి వివరించారు. ఈ విమానాశ్రయంలో ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల కార్గో (సరుకు రవాణా) సామర్థ్యం ఉందని, దీని ద్వారా ఈ ప్రాంతంలోని ఆక్వా, వ్యవసాయ, ఫార్మా ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసే గ్లోబల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *