సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 8వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం రానున్నారు. విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కు విద్యా దీవెన పథకంలో నిధులను భీమవరం బహిరంగ సభ నుండి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఆయన తనయుడు గ్రంధి రవితేజ తాడేపల్లి లోని సీఎం కార్యాలయంలో జగన్ ను కలసి ఆహ్యానించిన నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ యు రవిప్రకాష్ లు నేడు, సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా హెలికాప్టర్ దిగడానికి అనువైన ప్రాంతాన్ని, అదే మాదిరిగా బహిరంగ సభ జరిగే ప్రాంతాలను వారు పరిశీలించారు. కాగా 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా.. సీఎం జగన్, ప్రజాసంకల్ప యాత్రలో భీమవరం రావడం జరిగింది. తదుపరి పలుసార్లు శుభకార్యాలకు, పరామర్శలుకు రావడమే కాకుండా అల్లూరి సీతారామ రాజు విగ్రహ ఆవిష్కరణ సభలో ప్రధాని మోడీ తో ఒకే వేదిక పంచుకోవడం దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యింది. ఇప్పుడు మరో 4నెలలలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా గోదావరి జిల్లాల రాజకీయాలను శాసించే భీమవరంలో సీఎం జగన్ ప్రభుత్వఅధికారిక కార్యక్రమంతో అడుగుపెడుతుండటం పెద్ద విశేషమే..ఒక ప్రక్క ఎంపీ రఘురామా కృష్ణంరాజు మరో ప్రక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండే మరోసారి పోటీకి సిద్ధం అవుతుండటంతో సీఎం జగన్ భీమవరం పర్యటన పూహ్యాత్మకంగా చాల ప్రాధాన్యత తో కూడినదని చెప్పవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *