సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం ఉదయం 7 గంటల నుండి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ మాతలచే సామూహిక కుంకుమపూజలు అమ్మవారి నిర్వహిస్తున్నారు. నేటి, సాయంత్రం 6 గంటలకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ చేసిన మాత లచే జ్యోతి ఊరేగింపు పురవీధుల గుండా నిర్వహించనున్నారు. గత గురువారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండల దీక్షాపరులచే శ్రీ అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి ఆమెకు ఎన్నోరకాల మిఠాయిలు, పిండివంటలు, పండ్లు, పసుపు కుంకుమ, చీర ,గాజులతో భారీ ఎత్తున సారె సమర్పణ కన్నుల పండుగగా కార్యక్రమం జరిగినది.( ఫై ఫొటోలో) ప్రధానర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ధర్మకర్తలమండలి సభ్యులు ch శేషగిరి మరియు ఆలయసహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *