సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశం లోని ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు రేపు ఆదివారం వెలువడనున్నాయి.. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెలలో జరిగిన తెలంగాణ ,ఛతీస్ గడ్ , మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. అయితే, మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుం ది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి అయిపోతుంది. మరొ నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సెమీఫైనల్స్ గా చూస్తున్నాయి. అయితే ఇప్పటికే ఐదు రాష్ట్రాలకు సం బం ధిం చిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యా యి. తెలంగాణ, ఛత్తీస్ గడ్, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వే లు తెలిపాయి. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక, మిజోరం లో స్థానిక పార్టీల ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఈ సర్వే లు సూచిస్తున్నాయి. మరి అసలు జనం తీర్పు లో ఎవరికి ఊహించని షాకులు ఇస్తారో రేపటివరకు నిరక్షించవలసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *