సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం దేశంలో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ లో ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పడు ఉదయం 11న్నర గంటలసమయానికి అన్ని చోట్ల 4 నుండి 7 రౌండ్లు పూర్తీ అయ్యేసరికి కాంగ్రెస్ 69 స్థానాలలో అధికార బి ఆర్ ఎస్ పార్టీ 38 స్థానాలలో బీజేపీ 9 స్థానాలలో ఎంఐఎం 6స్థానాలలో ఆధిక్యతలో ఉన్నారు. అయితే మరో 5 రౌండ్లు పూర్తీ అయ్యితే సుమారుగా గెలిచే స్థానాలు నిర్ధారణ అవుతాయి. ఇక చత్తీస్‌ఘడ్ లో బీజేపీ కాస్త ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు కూడా హోరా హోరీగా తలపడుతున్నారు. ఇక , రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాడి ముందంజలో దూసుకెళ్తోంది. అయితే రాజస్థాన్లో ఎనిమిది స్థానాల్లో స్వతంత్రులు ముందంజలో ఉండటం విశేషము..
