సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో .. సమయం గడిచే కొద్దీ ఎన్నో ట్విస్టులు కనపడుతున్నాయి. ఇక కీలక మైన విషయం.. ఇప్పటికి ఏపీ సీఎం జగన్ కు అత్యంత ఆత్మీయుడు .. గతంలో తెలుగు రాష్ట్రాల విభజన తరువాత కూడా వైసిపి ఎంపీ గా ఖమ్మం నుండి ఒక లక్ష 25వేలు పైగా మెజారిటీ తో గెలవడమే కాకుండా అదే జిల్లా లో మరో 3 వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించి, మరో ముగ్గురిని ద్వితీయ స్థానంలో నిలిపిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పొంగులేటి శ్రీనివాస్.. తదుపరి పరిణామాలలో బి ఆరెస్ లో చేర్చుకొన్నాక అక్కడ సీఎం కెసిఆర్ తనను దారుణంగా అవమానించారని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్ల లోను కాంగ్రెస్ అభ్యర్థులనే గెల్పించుకొంటానని బి ఆర్ ఎస్ పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యే ను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని బిషణ ప్రతిజ్ఞ చేసిన పొంగులేటి శ్రీనివాస్ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడినాక నిజంగానే ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకొంటున్నారని ఫలితాలు సరళి బట్టి తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నుండి కాంగ్రెస్ అభ్యర్థులు 9 స్థానాలలో ముందంజ లో ఉండగా వారి మిత్ర పక్షం సీపీఐ అభ్యర్థి మెజారిటీలతో ముందంజలో ఉన్నారు.
