సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ప్రజలు ఏపీ కన్నా చైతన్యవంతులు.. అందుకే ఎన్నికలలో మొదట్లో తమకు బలమున్న 32 స్థానాలకు స్వంతంగా పోటీచేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ చివరకు బీజేపీతో పొత్తుపెట్టుకుని కేవలం 8స్థానాలలో పోటీలోకి దిగినప్పటికీ .. కూకట్ పల్లి ఒక్క స్థానంలో మినహా అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాస్త ఆలస్యంగా ప్రచారంలోకి దిగిన పవన్‌ కళ్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ఉధృత ప్రచారం నిర్వహించడం జనం విపరీతంగా రావడం జరిగిపోయింది. కానీ జనసేన, మెజారిటీ స్థానాల్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. నిజానికి కూకట్‌పల్లి లో జనసేన అభ్యర్థిగా పోటీచేసిన 3వ స్థానానికి పరిమితమైన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ నిజానికి బీజేపీ అభ్యర్థి అయినప్పటికి చివరకు పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీచేసి 3వ స్థానానికి పరిమితమై కేవలం 37వేలు ఓట్లు సాధించడం అందరిని నివ్వెరపరిచింది. అక్కడ బిఆర్ ఎస్ విజయం సాధించగా కాంగ్రెస్ 2వ స్థానం లోకి వచ్చింది. ఇక మిగతా 7 స్థానాలు మరి దారుణం.. ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాం డూరు, అశ్వారావుపేటలో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎక్కడ డిపాజిట్లు కూడా దక్కలేదు. తాండూరు లో 4వేలు 87 ఓట్లు మినహా ఎక్కడా పార్టీ అభ్యర్థులు సగటున 2 వేలకు మించి ఓట్లు సాధించలేదు,, నోటా ఓట్లతో పోటీ పడ్డారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *