సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములలో భాగం గా నేడు సోమవారం 21 రోజు.. భారీ వర్షాలతో సైతం భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ఈ రోజు భక్తుల ద్వారా 1330 అభిషేకము టిక్కెట్లు ద్వారా రూ.1,33,000/-లు, రూ.200/-ల దర్శనం 567 టిక్కెట్లు ద్వారా రూ.1,13,400/-లు, రూ.100/-ల దర్శనం 1519 టిక్కెట్లు ద్వారా రూ.1,51,900/-లు, రూ.50/-ల దర్శనం 1957 టిక్కెట్లు ద్వారా రూ.97,850/-లు, తో పాటు 1300 ప్రసాదం లడ్డులు విక్రయం ద్వారా రూ.19,500/-లు మొత్తంగా రూ.5,15,650/-లు ఆదాయం వచ్చిందని , నేటి తెల్లవారు జాము 3 గం. నుండి స్వామివారికి ప్రత్యక పూజలు ,అభిషేకాలు నిర్వహించామని దేవాలయ కార్యనిర్వాహణధీకారి డి రామకృష్ణంరాజు తెలిపారు. భారీ వర్షంలో సైతం భక్తులకు తగు ఏర్పాట్ల ను, నిత్యాన్నదాన సమారాధన దాతల సహకారంతో ధర్మకర్తల మండలి సభ్యులు కుర్మదాసు సత్యశ్రీనివాస్, నాచుశ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, కోయతాతాజీ, నల్లం రఘుబాబు, చెల్లబోయిన సూర్యప్రకాష్, శ్రీమతి సోమాదుల లీలా ఈశ్వరి, శ్రీ తాణాల రామకృష్ణ పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *