సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం లో ఈనెల 8వ తేదీన జరగవలసిన ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి పర్యటనపై డైలమో నెలకొంది. విద్య దీవెన నిధులు భీమవరం బహిరంగ సభ నుండి , రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి విడుదల చెయ్యవలసి ఉండగా అనుకోకుండా తుపాను ప్రభావం తో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడే అవకాశాలు కనపడు తున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్ తో సహా అధికారులు అందరూ తుపాను పరిస్థితులపై నష్టాలపై సమీక్షలు జరుపుతున్న నేపథ్యంలో .. రేపు బుధవారం కూడా భారీ వర్షాలు పడితే మాత్రం సీఎం పర్యటన కొద్దీ రోజుల పాటు తప్పనిసరిగా వాయిదా పడే అవకాశం ఉంది. భీమవరం లో ఆయన దిగే హెలి ప్యాడ్ మరియు గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షాల తాకిడికి మరో 2 రోజులలో ఏర్పాట్లు సర్దుకొనే అవకాశం కనపడటం లేదు మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *