సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహం కోసం దీక్ష స్వీకరించిన దీక్షమండలి సభ్యులు మాలధారణ ఇరుముడి కార్యక్రమం నేడు, గురువారం జరిగినది. సుమారు 500 మంది పైగా భక్తులు అమ్మవారికి ఇరుముడి సమర్పించుకున్నారు. స్థానికులతో పాటు అమలాపురం , తణుకు నర్సాపురం పట్టణాల నుండి కూడా శ్రీ అమ్మవారి మాల ధరించి కొందరు భక్తులు అమ్మవారికి ఇరుముడిలు సమర్పించడం విశేషం.. అనంతరం శ్రీ అమ్మవారికి ఆవు నెయ్యభిషేకం ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. తదుపరి మాలాదారులు మరియు వాళ్ళకుటుంబ సభ్యులు మరియు భక్తులతో కలిపి 1500 మంది భక్తులుకు అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్, మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తలు, ముత్యాల వెంకట రామారావు ,చెల్లంకి నాగ శేషగిరి, మావూరి సుందరరావు, రామాయణం సత్యనారాయణ, గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకట లక్ష్మీ , నీలాపు విజయ నాగలక్ష్మి పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణిధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *