సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నేడు, గురువారం ఉదయం డి.యన్.ఆర్. కళాశాల సీనియర్ డివిజన్ యన్.సి.సి.కాడెట్ల ఆధ్వర్యం లో సాయుధ దళాల జెండా దినోత్సవం ను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. బి యస్ శాంత కుమారి తెలిపారు. ఇందులో భాగంగా భీమవరం పట్టణ పుర వీధులగుండాజువ్వల పాలెం రోడ్డు, అంబేడ్కర్ చౌక్, ప్రకాశం చౌక్, క్రొత్త బస్ స్టాండు, మావుళ్ళమ్మ గుడి వీధి, తాలూక ఆఫీసు సెంటర్ , ఫుట్ పాత్ బ్రిడ్జి మీదుగా.. భారీ జన చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కళాశాల పాలక వర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ప్రారంభించి మొదటి విరాళాన్ని అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో జన సంచారం సాధ్యం కాని ప్రదేశాల్లో, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పహరా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్న ఎందరో సైనికుల సేవలు మరువలేనివి మరియువెలకట్టలేనివన్నారు. యుద్ధం లో గాయపడి ఉద్యోగాలు కోల్పోయిన లేదా మరణించిన వారి కుటుంబాలకు సైనిక సంక్షేమ నిధి ద్వారా సహాయం అందుతుందన్నారు. కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ డా .బి. యస్.శాంత కుమారి, కళాశాల పాలక వర్గ సభ్యులు పి. రామకృష్ణంరాజు మాట్లాడుతూ , గత సంవత్సరం డి.యన్.ఆర్.కళాశాల కాడెట్లు జిల్లాలోనే అత్యధికంగా విరాళాలు సేకరించారన్నారు. ఈ ర్యాలీ లో భాగంగా కాడెట్లు పట్టణ ప్రజలతో పాటు ప్రముఖులు మరియు పట్టణ ప్రజల నుండి విరళాలు సేకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *