సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో నేడు, గురువారం రాత్రి ఏఎస్ రాజా గ్రౌండ్లో జనసేన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. ఉత్తరాంధ్రలో బీసీలకు వైసీపీ సర్కార్ ఎం మేలు చేసిందని ?ప్రశ్నించారు. ఏపీలో బిసిలు ఉన్న కులాల వారిని తెలంగాణ రాష్ట్రంలో బీసీ లనుండి తొలగిస్తే ఎవరు మాట్లాడలేదని .. ఇక్కడ అధికారంలో ఉన్న వైసిపి నేతలు కూడా తెలంగాణాలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు ఇంతకాలం ప్రశ్నించలేదని విమర్శించారు. ( ప్రక్క రాష్ట్రం వ్యవహారాలలో తల దూర్చవచ్చా?) 151 సీట్లతో వైసీపీని గెలిపించినా ఇప్పటి వరకూ ఒక్క సరైనా ఉద్యోగం ఇవ్వలేదని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. భావోద్వేగంతో కూడినది అని పవన్ అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానని, విశాఖ ఉక్కుపై తన అభిప్రాయాన్ని అమిత్ షా గౌరవించారని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. యువత నా సభలలో చూపించే చొరవ ఎన్నికలలో ఓట్లు వేసే తప్పుడు చూపిస్తే మంచిదని అక్కడ హడావిడి చేస్తున్న యువకులను దృష్టిలో పెట్టుకొని పవన్ అన్నారు. “ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వానిదే అధికారం. 2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోతారు. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయారు. ఇక్కడ అంతే అని అని నాగబాబు అన్నారు..
