సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యగుల కోసం నిన్న నే గ్రూప్ 2 కి నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు తాజాగా నేడు, శుక్రవారం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. ఉన్నత ఉద్యోగాల కోసం 81 పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులు అయిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో జనవరి 1 నుంచి 21 అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ప్రకటించింది. నోటిఫికేషన్ కోసం కమిషన్ వెబ్‌సైట్‌లో చూడాలని స్పష్టం చేసింది. మార్చి 17న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌-9, డీఎస్పీ-26 పోస్టులు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *