సిగ్మాతెలుగు డాట్, న్యూస్: గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే రాజమండ్రి విమానాశ్రయం (మధురపూడి} లో కేంద్ర పౌర విమానాయన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా నేడు, ఆదివారం ఆధునిక టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజమండ్రి తొలిసారి రావడం సంతోషంగా ఉంది. ఇక్కడ 347 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని అతి త్వరలో నుంచి అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుండి విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని .. టెర్మినల్ నిర్మాణం సకాలంలో పూర్తిచేసి రాజమండ్రి నగరాన్ని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతామని జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా పేర్కొన్నారు. ఇప్పటికే 3,165 మీటర్లు పొడవు ఉన్న రన్ వే, ఒకేసారి 11 విమానాలు పార్కింగ్ చేసే వీలు ఉన్న రాజమండ్రి విమానాశ్రయం అతి త్వరలో ఒకేసారి టెర్మినల్ లో 1400 మంది ప్రయాణికులకు సదుపాయాలను కలిగించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించబడనుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *