సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు మరో 4 నెలలు లోపు జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎప్పడు పవనే చంద్రబాబు ను కలవాలా ? పొత్తు లో మాకు ఎన్ని ఇస్తారు అని అడగాలా? ఇరు పార్టీలు సమానం కదా? అని ప్రశ్నిస్తున్న జనసైనికుల అనుమానాలు.. వారి సందేహాన్ని తీర్చడానికి తొలిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి ( హైదరాబాద్ లో) టీడీపీ అధినేత చంద్రబాబు గత రాత్రి స్వయంగా వెళ్లి , జనసేన అధినేతతో భేటీ అయ్యి.. ఇరుపార్టీల పొత్తు బలోపేతానికి మరో ముందడుగు వేశారు. అయితే ఈ భేటీలో మొత్తం రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. ఆయన నేడు, సోమవారం ఉదయం విశాఖ మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు ,ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారన్నారు. జనసేనకు బలం, గెలిచే అవకాశం ఉన్న స్థానాలు లో సీట్లు ఇచ్చే దశగా ఆలోచనలు చేస్తున్నామన్నారు.( అసలు ఎన్ని సీట్లు ఇద్దామన్నది సస్పెన్సు.. ఇప్పటికైతే 18 సీట్లు.. జనసేన అభ్యర్థులు కన్ఫమ్ ..? సంక్రాంతి పండుగ వెళ్ళాక పూర్తీ సీట్లు లిస్ట్ ప్రకటిస్తారని సమాచారం) ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళిందని తెలిపారు. జనసేన సూచించిన మరికొన్ని అంశాలతో కలిపి త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. రాయలసీమ లేదా గుంటూరు కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *