సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని మధురానగర్ నివాసి మెట్టు సుమంత్ కుమార్ రెడ్డి కి వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం ప్రాంతానికి చెందిన దండు తరుణ చంద్ర తేజస్వీ వర్మ అనే వ్యక్తి హైదరాబాద్ లోని మరో ఇద్దరు మిత్రులతో కలసి రూ.3.56 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణపై నమోదు అయిన తాజా కేసుపై.. మధురానగర్ పోలీస్ పోలీసు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ..మధురానగర్ నివాసి మెట్టు సుమంత్ కుమార్ రెడ్డి వ్యాపారస్తుడు, అతనిని భీమవరం ప్రాంతానికి చెందిన దండు తేజస్వీ వర్మ మరియు వారాసిగూడలో ఉండే కొవెలముడి వెం కటరమణ ప్రసాద్, కూకట్ పల్లికి చెందిన ఉప్పల ఉమాశంకర్, వీరు ముగ్గురు 2019లో తనను కలసి తమకు భీమవరంలో ట్రయంఫ్ సొల్యూషన్ అనే సాఫ్ట్ వెర్ డెవలప్మెంట్ సంస్థ ఉందని లైవ్ స్పోర్ట్స్ , ఈవెంట్స్ కు సంబంధించి ఆన్ లైన్ గేమ్స్ ను అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే పలు యాప్లు, సాఫ్ట్ వేర్ , మొబైల్ అప్లికేషన్లు అభివృద్ధి చేశామని, వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పి వ్యాపారంలో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి మోసగించారని .. వారి మాటలు నమ్మి, సుమంత్ కుమార్ రెడ్డి వారి భాగస్వామ్యంతో 2021లో ఫ్రీ హిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ స్థాపించారు..48శాతం వాట తీసుకొన్నారు. దీంతో సుమంత్ కుమార్ రెడ్డి నుండి వ్యాపారం అభివృద్ధి నిమిత్తం విడతల వారీగా రూ.3,56,73,334 ఆ డబ్బు ను తీసుకోని నిందితులు తమ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. సంస్థకు ఎలాంటి ఆదాయం రాకపోవడంతో నిందితులను అడుగగా ఏవో సాకులు చెబుతూ వచ్చారు. మోసపోయానని గ్రహించిన సుమంత్ కుమార్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *