సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇం టర్మీ డియేట్ ద్వి తీయ సం వత్స రం చదువుతున్న ఇద్దరు విద్యా ర్థులు మిస్సింగ్ కేసు సంచలనం రేపుతోంది. వారిరువురు ఈనెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నెల్స్ ఆధారంగా వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తణుకు పట్టణం లోని కొండాలమ్మ పుంత ప్రాం తానికి చెందిన పెచ్చెట్టి కల్యాణ్, ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామానికి చెందిన కొండేటి ప్రవీణ్ ఇద్దరు కూడా ఈనెల 14న కళాశాలకు వెళుతున్నామని చెప్పి తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. అయితే గుడివాడ పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల సెల్ ఫోన్ సిగ్నల్స్ గుర్తించి బస్టాండు, రైల్వే స్టేషన్లలో పోలీసులు గాలింపులో వేగం పెంచారు..వారిరువురు నిజంగానే గుడివాడ వరకు చేరుకొన్నారా? అక్కడి నుండి ఎక్కడ కు వెళ్లారు? ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తణుకు పట్టణ పోలీసు స్టేషన్లో సమాచారం ఇచ్చి వారి కుటుంబ సభ్యుల మనోవేదన దూరం చెయ్యగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *