సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గం, వీరవాసరం మండలం, నందమూరుగరువు గ్రామంలో ప్రతిష్టాకరంగా జరిగే శ్రీ శ్రీ శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు అంటే జిల్లాలో తెలియనివారు ఉండరు. ప్రతి ఏడాది 11 రోజులు పాటు భారీ సెట్టింగ్స్, లైటింగ్, భారీ ఎగ్జిబిషన్ లతో, నాటక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలలో మహిమానీత శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ డిసెంబర్ 24వ తేదీన 58 వ వార్షిక ఉత్సవాల ను ప్రారంభిస్తున్నారు. జనవరి 4వ తేదీ వరకు జరిగే వేడుకలకు కార్యక్రమాలకు సంబందించిన పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు విడుదల చేయించారు. ఆయన శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారి ఉత్సవ కమిటీ నిర్వాహకులను ఏర్పాట్లను గురించి తెలుసుకొని వారిని అభినందించారు.
