సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో బైక్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పాలకొల్లు పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి ఎనిమిది మోటార్‌సైకిళ్లను స్వా ధీనం చేసుకొన్నారని పట్టణ సీఐ దారావత్తు రాంబాబు ప్రకటించారు. గత సోమవారం ఉదయం నరసాపురం వైపు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు హెల్మెట్ లు ధరించని బైక్ వాహనదారులను తనిఖీ చేస్తుండగా నరసాపురం నుంచి పాలకొల్లువైపు ఓ బైక్ పై హెల్మె ట్ లేకుం డా ముగ్గురు వ్యక్తులు వెళుతున్నట్లు పోలీసులు గమనించారు. వారిని ఆపే ప్రయత్నం చేయగా, వారు ఆగకుండా మరల వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. వెంటనే ఎస్సై , సిబ్బందితో కలిసి వారిని వెంబడించి పట్టుకొని విచారించగా వారు బైక్ దొంగిలించారని తెలిసింది. ఇక లోతుగా దర్యాప్తు చేసి వారు దొంగిలించిన 8 బైక్ లను కూడా స్వాదీనం చేసుకొన్నట్లు తెలిపారు. నిందితులు కోనసీమ కు చెందినవారు. బెండమూరులంకకు చెందిన వై.కృ ష్ణబాబు, గుండేపూడి గ్రామానికి చెందిన కె.ఓం సాయితేజ, పొదలాడకు చెందిన జి. వెంకటరత్నంలుగా గుర్తించారు. వీరిని విచారణ చేయగా గత నాలుగు నెలలుగా పశ్చి గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, వైజాగ్ జిల్లాల పరిసర ప్రాంతాల్లోమోటర్ సైకిళ్లు దొంగతనం చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి బుల్లెట్లు–2, గ్లామర్–1, హోండా ఫ్యాషన్–2, స్ప్లెండర్–1, షైనీ–1, పల్సర్–1 మొత్తం రూ.4 లక్షలు పైగా విలువైన ఎనిమిది మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
