సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క టీడీపీ , జనసేన పొత్తు లో భాగంగా సీట్ల పంపకం కూడా మొదలైయ్యింది. జనసేనకు ఎలానూ గోదావరి జిల్లాలలో కాపు ఓటర్లు ఎక్కువ ఉన్న సీట్లు కేటాయింపు కేటాయిస్తారని భావిస్తున్నారు. మరి ఇటువంటి కీలక సమయంలో వైసీపీ తరపున సీఎం జగన్ కూడా ప్యూహాత్మకంగా బలమైన కాపు పోరాట యోధుడుని రంగంలోకి దింపుతున్నారని .. ఆ సమయం వచ్చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే.. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వచ్చే జనవరి 1న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అభిమానుల్ని తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. తుని ఘటనల నేపథ్యంలో గత చంద్రబాబు ,లోకేష్ లు పోలీసులను ఉసిగొలిపి తన కుటుంబాన్ని దారుణంగా అవమానించారని అప్పటి నుండి వేడుకలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన ముద్రగడ .. గత ఏడాది, చంద్రబాబు మీడియా ముందు బోరున విలపించినప్పుడు తన హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది చూడటం కోసమే నేను బ్రతికి ఉన్నానని, కర్మ ఎవరిని వదిలిపెట్టదని తమపైనే, కాపు నేతలపై చంద్రబాబు పెట్టించిన అక్రమ కేసులు ఎత్తివేసిన సీఎం జగన్ కు కృతజ్నతలు తెలిపారు. అయితే ఈ ఎన్నికల ముంగిట ఈసారి ముద్రగడ కుటుంబ సభ్యులకు ఎంపీ లేదా ఎమ్మె ల్యే సీటు ఇచ్చేందుకు జగన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూతన సంవత్సర వేడుకలులో కాపు నేతల సూచనలను తీసుకోని వైసిపి చేరే ప్రకటన వస్తుందని వైసిపి అభిమానులు ఎదురుచూస్తున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *