సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని బ్రహ్మ కుమారీస్ సంస్థ వారి 2024 నూతన సంవత్సరం కేలండర్ ను నేడు, మంగళవారం సాయంత్రం భీమవరం గునుపూడి లోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భముగా దేశవ్యాప్తంగా బ్రహ్మ కుమారి సంస్థ వారు మానవాళి కి ఆధ్యాత్మిక ప్రశాంతత ను ప్రబోధించడంతో పాటు స్వచ్చంధ సేవలు అందించడంలో ముందుంటారని అభినందించారు.
