సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘బాహుబలి’ సినిమాల సిరీస్ ఘనవిజయాలు తరువాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పేరు ప్రపంచం అంతామారుమోగింది, అలాగే KGF సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దేశంలోనే అగ్ర దర్శకుల్లో ఒకరుగా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి ‘సలార్’ అనే సినిమా మొదటి భాగం తో ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళం నటుడు పృథ్వీరాజ్ ,జగపతి బాబు, శృతి హాసన్, కీలక పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా కథ ను పరిశీలిస్తే…దేవా (ప్రభాస్) తన తల్లితో (ఈశ్వరి రావు) ఎక్కడో మారుమూల ప్రాంతంలో చాలా మామూలుగా జీవిస్తూ వుంటారు. కృష్ణ కాంత్ కుమార్తె ఆధ్య (శృతి హాసన్) విదేశాల నుండి ఇండియాలో అడుగుపెట్టగానే కిడ్నప్ కు గురి అవుతుంది. తన తల్లి ఆదేశాలతో దేవా ఆధ్యాని రక్షిస్తాడు. అక్కడ నుండి అసలు కధ మొదలవుతుంది. ఖాన్సార్ అనే పట్టణంలో అధికార కుర్చీ కోసం అక్కడ నివసిస్తూ ఉంటే పలు రకాలైన జాతులు ప్రయత్నాలు చేస్తూ వుంటారు. ఆ పట్టణాన్ని రాజ మన్నార్ (జగపతిబాబు) పాలిస్తూ ఉంటాడు, కానీ అతని దగ్గర ఉండే దొరలు, ఇతరులు ఆ కుర్చీ కోసం యుద్ధం మొదలెడతారు. కానీ రాజ మన్నార్ తన కుమారుడు వరద మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ని ఆ కుర్చీ మీద ఉంచాలని ప్రయత్నం చేస్తాడు. మిగతా గ్యాంగ్స్ అందరూ వివిధ దేశాల నుండి ఆర్మీని తెచ్చుకుంటే వరద మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు అయినా దేవా సాయం కోరతాడు. దేవా తన స్నేహితుడు కోసం మళ్ళీ ఖాన్సార్ లో అడుగుపెడతారు. ఇక చుడండి.. రచ్చ రచ్చే.. చివరికి కుర్చీ ఎవరికీ దక్కింది, అసలు దేవా ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమాను విశ్లేషిస్తే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఖాన్సార్ అనే పట్టణాన్ని దేశ సరిహద్దులో ఒకటి సృష్టించి, క్లాసికల్ గా తీసిన మాస్ జాతర..సలార్. ఇందులో కెజిఎఫ్ కు మించిన ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ అద్భుతంగ తీశారు. హీరో ప్రభాస్ ఎలివేషన్ సన్నివేశాలు అన్నీ బాగా తీసాడు ప్రశాంత్ నీల్. సినిమాలో బాహుబలి స్థాయి పిట్ నెస్ తో ఉన్న ప్రభాస్ అంతా కలపి ఒక 12 సింపుల్ డైలాగ్స్ మాత్రమే మాట్లాడతాడు. అభిమానులు కోరుకొనే ‘మిర్చి ప్రభాస్’ ఇందులో చెలరేగిపోయాడు. సినిమా ప్రారంభ సన్నివేశాలు చాల నెమ్మదిగా కదిలిన.. సెకండ్ హాఫ్ వేగంగా.. చివరికి క్లైమాక్స్ మాత్రం అదిరిపోతోంది. సినిమా ద్వితీయార్ధం లో కనపడిన పృథ్వీరాజ్ ,జగపతి బాబు పాత్రలు గంబిరంగా ఉన్నాయి. శృతి హాసన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, బ్రహ్మాజీ, జాన్సీ తమ పాత్రలలో డిఫెరెంట్ లుక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ ఛాయాగ్రహణం పెద్ద హైలైట్ గా చెప్పుకోవాలి. మూడు గంటల్లో నిడివితో తీసిన సినిమాలో ప్రేక్షకులకు చాలా సందేహాలు మిగిలాయి. మరి అవన్నీ రెండో పార్టులో తీరుస్తారేమో..
