సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో కరోనా కేసుఒకటి ఇటీవల బయటపడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యాప్తి నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుచర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు వందేసి చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను పంపిణీ చేసింది. తీవ్ర తలనొప్పి, దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫ్లుయింజా లక్షణాలతో ఆస్పత్రి అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగాలకు వచ్చే రోగులకు, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో వచ్చే రోగుల నుంచి శ్వాబ్‌లను సేకరించి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లతో కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది. ఈ టెస్టుల్లో పాజిటివ్ నిర్ధారణ అయిన రోగుల శాంపిల్‌ను కొవిడ్ వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది. ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ వైద్యుడి ఆరోగ్యస్థితి నిలకడగానే ఉందని, ఆయనను కలిసిన ఆరుగురు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తుల నుంచి శ్వాబ్‌లను సేకరించి టెస్టులు చేశామని ఎవరికీ కొవిడ్ లక్షణాలు నిర్ధారణ కాలేదని తెలిపారు. కొత్త ఏడాది పండుగలు సమీపిస్తున్న వేళా రద్దీ ప్రదేశాలలో ప్రజలు మాస్క్ లు ధరించడం మంచిది.
